HomeసినిమాHeroine Rukmini Vasant | దక్షిణాదిని శాసించేందుకు రెడీ అవుతోన్న రుక్మిణి వసంత్.. స్టార్ హీరోయిన్‌గా...

Heroine Rukmini Vasant | దక్షిణాదిని శాసించేందుకు రెడీ అవుతోన్న రుక్మిణి వసంత్.. స్టార్ హీరోయిన్‌గా మారిన “కాంతార” బ్యూటీ

Heroine Rukmini Vasant | క‌న్న‌డ నాట సినీ ప్ర‌స్తానం మొదలు పెట్టిన రుక్మిణీ వ‌సంత్...కాంతార సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఇప్పుడు ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్, రామ్ చరణ్ – సుకుమార్ లాంటి బిగ్ లెవెల్ ప్రాజెక్టుల‌తో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా మార‌బోతుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heroine Rukmini Vasant | మొన్న‌టి వ‌ర‌కు కన్నడ చిత్రసీమలో సంద‌డి చేసిన‌ రుక్మిణి వసంత్ ఇప్పుడు సౌత్ ఇండ‌స్ట్రీని షేక్ చేస్తుంది.. రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన సంచలన చిత్రం “కాంతార చాప్టర్ 1″(Kantara Chapter 1) ఆమె కెరీర్‌ను పూర్తిగా మలుపు తిప్పింది.

ఆ సినిమాలో రిషబ్ పక్కన హీరోయిన్‌గా నటించిన ఆమె తన సహజ నటన, నిబద్దతతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. తెరపై ఆమె కనిపించిన ప్రతి సీన్‌ ప్రేక్షకుల్లో చెర‌గ‌ని ముద్ర వేసింది. దీంతో రుక్మిణి ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌ల జాబితాలోకి చేరింది.

Heroine Rukmini Vasant | ద‌టీజ్ రుక్మిణి..

కేవలం అభిమానులే కాదు, సినీ విమర్శకులు, ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆమె నటనలో కనిపించే భావాలు చూసి నేషనల్ లెవెల్ న్యాచురల్ యాక్ట్రెస్ గా అభివర్ణించారు. ఇప్పటికే రుక్మిణి వసంత్ కెరీర్ స్పీడ్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఆమె, దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా డ్రాగన్ లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందుతోంది. ఇందులో రుక్మిణి పాత్ర ఎంతో కీలకమని, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని సమాచారం.

ఇంతకంటే హైపెక్కించే విషయం ఏమిటంటే ..ఇప్పుడు రుక్మిణి వసంత్(Heroine Rukmini Vasant), రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందబోయే సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక అయినట్లు టాలీవుడ్ వర్గాల్లో ఓ వార్త‌ చక్కర్లు కొడుతోంది. సుకుమార్ – చరణ్ కాంబినేషన్ అంటేనే భారీ అంచనాలు, ఎమోషనల్ డెప్త్ ఉన్న కథలు, బలమైన క్యారెక్టర్స్‌కి పెట్టింది పేరు. అలాంటి సినిమాలో రుక్మిణి ఎంపిక అయితే, ఆమె కెరీర్ మరింత ఎత్తుకి చేరడం ఖాయం. ఈ వార్తలపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ బజ్ నెలకొంది.

ఇద్ద‌రు పెద్ద స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమా ఛాన్సులు అందుకుందంటే అది ఏ హీరోయిన్‌కైనా గోల్డెన్ స్టేజ్ అనే చెప్పాలి. రుక్మిణి వసంత్ కోసం ఇప్పుడు నిర్మాతలు, డైరెక్టర్లు క్యూలో నిలబడుతున్నారు. కేవలం గ్లామర్‌కి పరిమితం కాకుండా, కథలో భాగంగా ఉన్న క్యారెక్టర్స్‌నే ఎంపిక చేస్తూ, ఆర్టిస్టిక్ పరంగా ఎదుగుతున్న ఆమె, ఇప్పుడు దక్షిణాది తెరపై రైజింగ్ స్టార్‌గా దూసుకెళ్తోంది.