అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rukmini Vasant | గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో (Director Geetu Mohandas) యష్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ నుంచి మరో హీరోయిన్ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న రుక్మిణి వసంత్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ ఇవాళ (జనవరి 6) అధికారికంగా రిలీజ్ చేశారు.
ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ మెలిసా అనే పాత్రలో కనిపించనుంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆమె ఇప్పటివరకు చేసిన సాధారణ పక్కింటి అమ్మాయి పాత్రలకు పూర్తిగా భిన్నంగా, గ్లామర్ అవతారంలో దర్శనమిచ్చింది. థై స్లిట్ ఉన్న నీలం రంగు డ్రస్, ప్రత్యేకమైన హెయిర్ స్టైల్‌తో పార్టీలో పొగమంచు నిండిన వాతావరణం మధ్య నడుస్తున్న ఆమె లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Rukmini Vasant | మెలిసాగా రుక్మిణి
హీరో యష్ (Hero Yash) సోషల్ మీడియాలో ఫస్ట్ లుక్‌ను షేర్ చేస్తూ,“రుక్మిణి వసంత్‌ను మెలిసాగా పరిచయం చేస్తున్నాం. టాక్సిక్ – ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్” అని పేర్కొన్నారు. ఈ పోస్టు క్షణాల్లో వైరల్‌గా మారింది. డైరెక్టర్ గీతు మోహన్ దాస్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రుక్మిణి గురించి ప్రశంసల వర్షం కురిపించారు. “నటిగా ఆమె తెలివితేటలు నాకు చాలా ఇష్టం. ఆమె కేవలం నటించదు, ఆలోచిస్తుంది. సందేహంతో కాదు, ఉత్సుకతతో ప్రశ్నలు అడుగుతుంది. అది దర్శకుడిగా నన్ను ఇంకా లోతుగా ఆలోచించేటట్లు చేస్తుంది” అని తెలిపారు.
అంతేకాదు, షాట్ల మధ్య ఆమె తన జర్నల్‌లో నిశ్శబ్దంగా రాస్తూ ఉండడం నేను తరచూ చూస్తాను. ఆమె అంతర్గత ప్రపంచాన్ని నిర్మించుకుంటూ ఉండటం చాలా ఆలోచనాత్మకంగా అనిపిస్తుంది. ఆ ప్రాసెస్ వెనుక ఉన్న మనస్సును అర్థం చేసుకోవాలని అనిపిస్తుంది. ఐ లవ్ యూ రుక్మిణి” అంటూ గీతు భావోద్వేగంగా స్పందించారు. ఇప్పటికే యష్ లుక్, ఇతర హీరోయిన్ ఫస్ట్ లుక్స్‌తో భారీ హైప్ క్రియేట్ చేసిన టాక్సిక్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన రుక్మిణి వసంత్ ఫస్ట్ లుక్‌తో ఆ అంచనాలు మరింత పెరిగాయని చెప్పొచ్చు.