అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rubicon IPO | దేశీయ స్టాక్ మార్కెట్‌లో (Domestic Stock Market) గురువారం రెండు మెయిన్‌బోర్డ్ (Main board) కంపెనీలు లిస్టయ్యాయి. రూబికాన్ మంచి లాభాలను అందించగా.. కెనరా రుబేెకో పరవాలేదనిపించింది.
Rubicon IPO | రూబికాన్ రీసెర్చ్..
ఫార్మాస్యూటికల్ సంస్థ అయిన రూబికాన్ రీసెర్చ్ (Rubicon Research) కంపెనీ రూ. 1,377.50 కోట్లను సమీకరించడం కోసం ఐపీవోకు (IPO) వచ్చింది. సబ్‌స్క్రిప్షన్ ఈనెల 9న ప్రారంభమై 13 న ముగిసింది. కంపెనీ షేర్లు గురువారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టయ్యాయి. గరిష్ట ప్రైస్ బాండ్ వద్ద ఒక్కో షేరు ధర రూ. 485 కాగా.. రూ. 135 ప్రీమియంతో (Premium) రూ. 620 వద్ద లిస్టయ్యింది. అంటే ఐపీవో ఇన్వెస్టర్లకు లిస్టింగ్ సమయంలోనే 27.84 శాతం లాభాలను అందించిందన్న మాట. మధ్యాహ్నం 12 గంటల సమయంలో రూ. 621 వద్ద ట్రేడ్ అవుతోంది.
Rubicon IPO | కెనరా రొబేకో..
కెనరా రోబేెకో అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (Canara Robeco AMC) ఐపీవో ద్వారా రూ. 1,326.13 కోట్లను సమీకరించింది. ఈ కంపెనీ షేర్లు గురువారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టయ్యాయి. కంపెనీ ఒక్కో షేరును రూ. 266కు విక్రయించగా.. గురువారం రూ. 14.25 ప్రీమియంతో రూ. 280.25 వద్ద లిస్టయ్యింది. అంటే లిస్టింగ్ (Listing) సమయంలో 5.36 శాతం లాభాలను అందించింది. లిస్టయిన తర్వాత కొనుగోళ్ల మద్దతు లభించడంతో షేరు ధర గణనీయంగా పెరిగింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సుమారు 18 శాతం లాభం(Profit)తో 313 వద్ద కొనసాగుతోంది.