అక్షరటుడే, బోధన్ : Transport Department | నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై అధికారులు వరస దాడులు చేస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (Transport Commissioner) ఆదేశాల మేరకు బోధన్ పట్టణంలో పలు స్కూల్ బస్సులను ఆర్టీఏ అధికారులు, ఆర్డీవో శ్రీనివాస్ (RDO Srinivas) ఆధ్వర్యంలో తనిఖీ చేశారు.
ఈ మేరకు శుక్రవారం ఉదయం బోధన్ (Bodhan) పట్టణంలో 12 స్కూల్ బస్సులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. నిబంధనలు పాటించని మూడు బస్సులకు రూ.47వేల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో బోధన్ ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ (Traffic CI Chander Rathod) తదితరులు పాల్గొన్నారు.

