RTI-Commissioners
RTI Commissioners | ప్రమాణ స్వీకారం చేసిన ఆర్టీఐ కమిషనర్లు

అక్షరటుడే, వెబ్​డెస్క్:RTI Commissioners | నూతనంగా నియామకం అయిన తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్లు బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర సచివాలయంలోని అంబేడ్కర్​ భవన్​లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు. ఆర్టీఐ కమిషనర్లుగా ప్రభుత్వం పీవీ శ్రీనివాసరావు, మొహసినా పర్వీన్​, దేశాల భూపాల్, భోరెడ్డి అయోధ్యరెడ్డిని ప్రభుత్వం సోమవారం నియమించిన విషయం తెలిసిందే.

రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్​గా ఐఎఫ్​ఎస్​ అధికారి జి చంద్రశేఖర్​రెడ్డి(IFS Officer G Chandrasekhar Reddy) శుక్రవారం ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఆయనతో గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ ప్రమాణం చేయించారు. తాజాగా నలుగురు కమిషనర్లతో ప్రధాన కమిషనర్​ చంద్రశేఖర్​రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా రాష్ట్రంలో కొంతకాలంగా సమాచార కమిషనర్ల పదవులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆర్టీఐ(RTI) చట్టం లక్ష్యాలు నెరవేరడం లేదు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం ఐదుగురు కమిషనర్లను నియమించింది. వీరిలో పీవీ శ్రీనివాసరావు, అయోధ్యరెడ్డి జర్నలిజం బ్యాక్​గ్రౌండ్​ నుంచి వచ్చారు. వీరిలో అయోధ్యరెడ్డిని సీఎం గతంలోనే సీపీఆర్​వోగా నియమించుకున్నారు. తాజాగా ఆయన ఆర్టీఐ కమిషనర్​ కావడంతో పీఆర్​వోగా మరొకరిని నియమించే అవకాశం ఉంది.