Homeజిల్లాలుకామారెడ్డిKamareddy Collector | స.హ. చట్టాన్ని పారదర్శకంగా అమలు చేయాలి: జిల్లా కలెక్టర్

Kamareddy Collector | స.హ. చట్టాన్ని పారదర్శకంగా అమలు చేయాలి: జిల్లా కలెక్టర్

ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ పేర్కొన్నారు. కలెక్టరేట్​లో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collector | సమాచార హక్కు చట్టాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకంగా అమలు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్టీఐ-2005 వారోత్సవాలలో (RTI-2005 week celebrations) భాగంగా శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఆర్టీఐ చట్టం (RTI Act) అమలు, మార్గదర్శకాల ప్రకారం అమలు చేస్తామని అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. స.హ. చట్టం వలన ప్రజలకు కలిగే ప్రయోజనాలు, చట్టం అమలు తీరు, అందులో ఉన్న అంశాలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ శాఖలలో (government departments) పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు స.హ. చట్టం తీసుకువచ్చారని పేర్కొన్నారు.

ఆర్టీఐ చట్టం లక్ష్యాన్ని నెరవేర్చేలా పనిచేయాలన్నారు. అన్ని కార్యాలయాల పీఐవోలు ప్రజలు అడిగిన సమాచారాన్ని ఎలాంటి దాపరికం లేకుండా నిర్ణీత సమయంలో అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్, డీఆర్​వో మధు మోహన్, ఎల్లారెడ్డి ఆర్డవో పార్థసింహారెడ్డి, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, కలెక్టరేట్ ఏవో, సెక్షన్ ఆఫీసర్స్, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పీఐవోలు పాల్గొన్నారు.