HomeతెలంగాణRTC | మే 7 నుంచి ఆర్టీసీ సిబ్బంది సమ్మె

RTC | మే 7 నుంచి ఆర్టీసీ సిబ్బంది సమ్మె

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGS RTC)లో సమ్మె సైరన్​ మోగనుంది. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆర్టీసీ సిబ్బంది RTC workers strike సమ్మెకు పిలుపునిచ్చారు. లేదంటే మే 7 నుంచి నిరవధిక సమ్మె చేపడుతామని తేల్చి చెప్పారు.

కేసీఆర్​ KCR హయాంలో 2019 అక్టోబర్​లో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టారు. ఆ సమయంలో ప్రభుత్వం సిబ్బంది సమ్మెపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్​తో అప్పుడు సమ్మె చేపట్టారు. అయితే ప్రభుత్వం దిగిరాకపోవడంతో కార్మికులే వెనక్కి తగ్గారు. తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరారు.

RTC | హామీలు అమలు చేయాలని..

కాంగ్రెస్​ congress తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు తమ సమస్యలు పరిష్కరించాలని కార్మికులు కోరుతున్నారు. ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, తమకు ప్రభుత్వ ఉద్యోగాల మాదిరి జీతాలు చెల్లించాలని డిమాండ్​ చేస్తున్నారు. రిటైర్​ అయిన 16 వేల మంది స్థానంలో కొత్తగా నియామకాలు చేపట్టాలని కోరుతున్నారు.

RTC | అన్ని సంఘాలు మద్దతు ఇవ్వాలి

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్ని సంఘాలు మద్దతు తెలపాలని జేఏసీ JAC నాయకులు కోరారు. కొన్ని సంఘాల నాయకులు యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. తమ డిమాండ్ల సాధన కోసం ఏప్రిల్​లోనే జేఏసీ నాయకులు ఆర్టీసీ సంస్థకు సమ్మె నోటీసు అందించారు. యాజమాన్యం, ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో సమ్మెకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో మే 6 అర్ధరాత్రి నుంచి బస్సులు నిలిచిపోనున్నాయి.