TGSRTC
TGSRTC | పండుగల నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు

అక్షరటుడే, బాన్సువాడ : RTC tour packages | ఆర్టీసీ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలకు ప్రత్యేక టూర్ ప్యాకేజీలను (special tour packages) ప్రారంభించింది. సంస్థకు ఆదాయంతో పాటు ప్రయాణికుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక టూర్ ప్యాకేజీల పేరిట అధికారులు బస్సులు నడుపుతు న్నారు. కొన్ని ప్రముఖ క్షేత్రాలకు నేరుగా బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బంది పడేవారు. ఆయా ప్రాంతాలకు రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ ప్రత్యేక టూర్​ ప్యాకేజీలు ప్రవేశ పెట్టింది. ఆయా ప్యాకేజీలకు ప్రయాణికుల (passengers) నుంచి మంచి స్పందన వస్తోంది.

నిజామాబాద్ రీజియన్ పరిధిలో బాన్సువాడ, ఆర్మూర్, కామారెడ్డి, బోధన్ డిపోలు ఉన్నాయి. ఆయా డిపోల నుంచి పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలకు ప్రత్యేక టూర్ బస్సులు నడుస్తున్నాయి. ఒకే రోజు నాలుగు పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వీలు కల్పిస్తోంది. అది కూడా కేవలం రూ.వెయ్యి నుంచి ప్రారంభమయ్యే టికెట్ ధరలతో (Starting ticket prices) ఈ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్​ వాహనాలపై ఆధారపడకుండా, సురక్షితంగా, సౌకర్యవంతంగా తీర్థయాత్రలకు వెళ్లేలా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ప్యాకేజీల కోసం సంస్థ అధికారిక వెబ్ సైట్ tsrtconline.in లో రిజర్వేషన్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఆయా టూర్​ ప్యాకేజీల్లో భాగంగా టికెట్​ రేట్లు చెల్లిస్తే ఎంపిక చేసిన ఆలయాలు, ప్రదేశాలకు తీసుకు వెళ్తారు.

RTC tour packages | ఆర్మూర్ పట్టణం నుంచి..

  • యాదగిరిగుట్ట, స్వర్ణగిరి యాత్రకు ఒక్కొక్కరికి రూ.1,500.
  • వరంగల్ వేయి స్తంభాల గుడి, మేడారం, రామప్ప గుడికి రూ.1,100.
  • పండరీపూర్, తుల్జాపూర్, సోలాపూర్ టూర్​కి రూ. 2,400.
  • అరుణాచలం గిరి ప్రదక్షిణ, గోల్డెన్ టెంపుల్, కాణిపాకం, జోగులాంబ శక్తిపీఠం సందర్శనకు రూ. 5,100.

RTC tour packages | బాన్సువాడ నుంచి..

  • బాన్సువాడ నుంచి యాదగిరిగుట్ట, స్వర్ణగిరికి టూర్​ ప్యాకేజీ అందు బాటులో ఉంది. డీలక్స్ బస్సులో టికెట్ ధర రూ.వెయ్యిగా నిర్ణయించారు.
  • బాన్సువాడ నుంచి వరంగల్ రామప్ప ఆలయం, లక్నవరం లేక్ వ్యూ, భద్రకాళి ఆలయానికి మరో ప్యాకేజీ ఉంది. డీలక్స్​ బస్సుల్లో ఒక్కొక్కరు రూ.1,500 చెల్లించాలి.
  • జరాసంగం మహాదేవుని ఆలయం, బీదర్‌ నరసింహస్వామి ఆలయం, గానుగాపూర్ దత్తాత్రేయ ఆలయం దర్శనానికి బస్సులు నడుపుతున్నారు. ఈ ప్యాకేజీలో భాగంగా టికెట్​ ధర రూ.1,300గా నిర్ణయించారు.
  • హైదరాబాద్ బిర్లా టెంపుల్, సాలార్​జంగ్​ మ్యూజియం, ముచ్చింతల్ టూర్​కు రూ.1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
  • బాన్సువాడ నుంచి పర్లి వైజనాథ్, అంబాజోగాయ్, పండరీపూర్ విఠలేశ్వరాలయం, తుల్జాపూర్, సోలాపూర్​కు వెళ్లొచ్చు. ప్యాకేజీలో భాగంగా టికెట్​ ధర రూ.2200 చెల్లిస్తే సూపర్​ లగ్జరీ బస్సులో తీసుకు వెళ్తారు.

RTC tour packages | కామారెడ్డి బస్టాండ్ నుంచి..

  • వరంగల్ వేయి స్తంభాల గుడి, భద్రకాళి దే వాలయం, రామప్ప ఆలయాలకు రూ.వెయ్యి.
    తుల్జాపూర్, పండరీపూర్, అంబా జోగై, పర్లి వైజనాథ్, ఔంద నాగనాథ్, మహూర్​ ప్యాకేజీ కోసం టికెట్ ధర రూ.3,200.
  • కొమురవెల్లి మల్లన్న ఆలయం, వరంగల్, చిలుకూరు బాలాజీ ఆలయం, రామగుండం, అనంతగిరి, కోటిపల్లి ప్రాంతాల సందర్శనకు కామారెడ్డి నుంచి ప్యాకేజీ అందుబాటులో ఉంది. దీని కోసం రూ. 1500 చెల్లించాలి.
  • బద్రీనాథ్ దేవస్థానం (మేడ్చల్ ), బిర్లా టెంపుల్, సాలార్​జంగ్​ మ్యూజియం, చార్మినార్, జూ పార్క్, ట్యాంక్ బండ్ సందర్శన కోసం రూ.వెయ్యి టికెట్​గా నిర్ణయించారు.
  • మేడారం, రామప్ప గుడి, వరంగల్ కోట, భద్రకాళి గుడి, వేయి స్తంభాల గుడి సందర్శనకు రూ.1,100 టికెట్​.
  • వరంగల్, కొమురవెల్లి, యాదగిరిగుట్ట, రమణేశ్వరం, స్వర్ణగిరి ఆలయాల ప్యాకేజీ టికెట్​ ధర రూ. 1500.
  • వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, గూడెం గుట్టకు రూ. 1500.
  • ఆగస్టు 8న సాయంత్రం 6 గంటలకు కామారెడ్డి నుంచి కానిపాకం, గోల్డెన్ టెంపుల్(వేలూర్), అరుణాచలం గిరి ప్రదక్షిణ యాత్రకు బస్సు బయలు దేరనుంది. ఈ ప్యాకేజీలో భాగంగా టికెట్ ధర ఒక్కొక్కరికి రూ.5 వేలు.

RTC tour packages | మరిన్ని టూర్​లు నడపాలి

– ఊర్మిళ, బాన్సువాడ

ఆర్టీసీ ప్యాకేజీలో భాగంగా నేను ము చ్చింతల్, బిర్లా మందిర్, సాలర్​జంగ్​ మ్యూజియం టూర్​కు వెళ్లాను. అంద రితో కలిసి వెళ్లడం చాలా ఆనందంగా ఉంది. టూర్​లో ఎలాంటి ఇబ్బందులు కలగలేవు. ఆర్టీసీ మరిన్ని టూర్ ప్యాకేజీలు కల్పించాలి. ‌

RTC tour packages | కొత్త అనుభూతి

– శోభ, బాన్సువాడ

యాదగిరిగుట్ట, స్వర్ణగిరికి వెళ్లాను. కొత్త వారితో కలిసి వెళ్లడం కొత్త అనుభూతిని ఇచ్చింది. మరిన్ని తీర్థయాత్రలకు ఆర్టీసీ సౌకర్యం కల్పించాలి.

RTC tour packages | ఆదరణ బాగుంది

– సరితా దేవి, డిపో మేనేజర్, బాన్సువాడ

తీర్థయాత్రల టూర్ ప్యాకేజీలకు మంచి ఆదరణ లభిస్తుంది. మరిన్ని ప్రాంతాలకు బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ప్యాకేజీల్లో సౌకర్యాలు కల్పిస్తున్నాం.