అక్షరటుడే, బాన్సువాడ: RTC tour package | నిజామాబాద్ రీజియన్ పరిధిలోని పలు డిపోల నుంచి ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీల నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలకు స్పెషల్ బస్సులను నడుపుతోంది. పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకునే ప్రజలకు ఆర్టీసీ డిపో ప్రత్యేక టూర్ ప్యాకేజీలు (RTC depot special tour packages) ఎంతగానో ఉపయోగపడుతున్నారు. వీటిని ప్రజలు ఆదరిస్తున్నారు. ప్రయాణికులు, భక్తుల కోరిక మేరకు బాన్సువాడ డిపో నుంచి వారం రోజులకు ఒక తీర్థయాత్ర టూర్ ప్యాకేజీ (pilgrimage tour package) బస్సును నడుపుతున్నారు. తక్కువ ఖర్చుతో పుణ్యక్షేత్రాలు, విహారయాత్రలకు వెళ్లాలనుకునే వారికి ఈ టూర్ ప్యాకేజీలు ఉపయోగపడుతున్నాయి.
బాన్సువాడ డిపో నుంచి చిలుకూరి బాలాజీ మందిరం దర్శనం (Chilukuru Balaji Mandir), అనంతగిరి పద్మనాభ స్వామి ఆలయ (Anantagiri Padmanabha Swamy Temple) దర్శనం, అనంతగిరి హిల్స్‌కు (Anantagiri Hills) ప్రత్యేక టూర్ ప్యాకేజీ కేటాయించినట్లు డిపో మేనేజర్ సరితాదేవి తెలిపారు. ఈనెల 13న ఉదయం 5.30 గంటలకు బాన్సువాడ నుంచి డీలక్స్ బస్సు బయలుదేరుతుందని, తిరిగి బాన్సువాడకు రాత్రి 12 గంటలకు చేరుకుంటుందని చెప్పారు. టికెట్ ధర పెద్దలకు రూ. 1000, పిల్లలకు రూ.500 ఉంటుందని, రిజర్వేషన్ కోసం గోపికృష్ణ ఫోన్ 9063408477 నంబరును సంప్రదించాలని ఆమె కోరారు.