HomeతెలంగాణRTC Strike | ఆర్టీసీ ఉద్యోగుల్లారా.. ఏ పథకం ఆపమంటారో చెప్పండి..: సీఎం రేవంత్

RTC Strike | ఆర్టీసీ ఉద్యోగుల్లారా.. ఏ పథకం ఆపమంటారో చెప్పండి..: సీఎం రేవంత్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​:RTC Strike | రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్న పరిస్థితుల్లో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె(Strike)కు వెళ్తామని అంటున్నారని.. వారి డిమాండ్ల కోసం రాష్ట్రంలో ఏ పథకాన్ని ఆపాలో వారే నిర్ణయించాలని సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) అన్నారు.

హైదరాబాద్​లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమ్మె పేరుతో ప్రజల గుండెల్లో చురకత్తులు పొడవవద్దని సూచించారు. ఆర్టీసీ ఉద్యోగులు (RTC Employees) సమ్మె చేస్తే తెలంగాణ దివాళా రాష్ట్రంగా మారుతుందని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కొందరు ఫామ్​హౌస్(Farmhouse)లో నిద్రపోతున్నారని విమర్శించారు. ప్రజలకు ఇబ్బంది పెట్టే ఏ సంస్థ కూడా భవిష్యత్తులో మనుగడ సాధించలేదని స్పష్టం చేశారు. మీకు(ఆర్టీసీ సిబ్బందికి) జీతాలు ఇస్తున్న ప్రజలే తమకు ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు.