అక్షరటుడే, వెబ్‌డెస్క్: RTC strike | తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె వాయిదా పడింది. మంత్రి పొన్నం ప్రభాకర్తో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలమయ్యాయి. దీంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగ సంఘాల సమస్యల పరిష్కారం కోసం ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీని వేశారు. ఈ కమిటీలో నవీన్ మిట్టల్, లోకేశ్, కృష్ణ భాస్కర్ సభ్యులుగా ఉంటారు. వీరు ఉద్యోగుల సమస్యలపై అధ్యయనం చేయనున్నారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.
Must Read
Related News
