HomeUncategorizedLady Conductor | ప్ర‌యాణికుడి చొక్కా ప‌ట్టుకొని కొట్టిన లేడి కండ‌క్ట‌ర్..కార‌ణం ఏంటంటే..!

Lady Conductor | ప్ర‌యాణికుడి చొక్కా ప‌ట్టుకొని కొట్టిన లేడి కండ‌క్ట‌ర్..కార‌ణం ఏంటంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Lady Conductor | ఓ లేడి కండ‌క్ట‌ర్ అంద‌రి ముందు ప్ర‌యాణికుడి చొక్కా ప‌ట్టుకొని కొట్ట‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయింది. కృష్ణా జిల్లా(Krishna District) తోట్లవల్లూరులో ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌గా, ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఉయ్యూరు డిపోకు చెందిన RTC బస్సులో పెద్దిబోయిన మల్లిఖార్జునరావు అనే వృద్ధుడు తోట్లవల్లూరు(Thotlavallur) నుంచి ఉయ్యూరు వెళుతున్న సందర్భంలో టికెట్‌ కోసం రూ.200 నోటు ఇచ్చారు. అయితే పెద్ద నోటు ఇస్తే ఎలా అని లేడీ కండక్టర్(Lady Conductor) అన‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య‌ మాటామాట పెరిగింది. ఇది వాగ్వాదంగా మారింది.

Lady Conductor | ఎందుకు కొట్టింది..

ఆగ్రహంతో కండక్టర్ బస్సును కనకదుర్గ కాలనీ వద్ద ఆపి, మల్లిఖార్జునరావును బస్సు నుంచి దించేశారు. దాంతో నన్ను ఎందుకు దింపుతావ‌ని మ‌ల్లికార్జురావు ప్ర‌శ్నించ‌గా, న‌న్నే తిడ‌తావా అంటూ కండ‌క్ట‌ర్ ప్ర‌యాణికుడి చొక్కా ప‌ట్టుకొని చెంప‌పై కొట్టింది. ఇంత‌లో అక్క‌డికి స్థానికులు చేరుకున్నారు. ఏం జరిగిందని కండక్టర్‌ను ప్రశ్నించారు. మల్లిఖార్జున రావు తనను బూతులు తిట్టాడని కండక్టర్ చెప్ప‌గా, నేను ఏమి అన‌లేద‌ని స‌ద‌రు ప్ర‌యాణికుడు అన్నాడు. తిట్ట‌లేవంటే మ‌ళ్లీ కొడ‌తానంటూ హెచ్చ‌రించింది. అయితే కండక్టర్​కు స‌ర్ది చెప్పి ఆయ‌న‌ని వదిలేయమని స్థానికులు చెప్పడంతో కండక్టర్‌ ప్రయాణికుడి చొక్కా వదిలిపెట్టారు.

ఇక మల్లికార్జునరావుని అక్కడే వదిలేసి బస్సు వెళ్లిపోయింది. అయితే ఈ గొడవపై ఇప్పటివరకు ఎటువంటి పోలీస్ ఫిర్యాదు నమోదు కాలేదు. స‌ద‌రు మహిళా కండక్టర్ గతంలోనూ ప్రయాణికులతో (Passengers) దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే ఆమెపై కొందరు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. మచిలీపట్నం ఆర్టీసీ డీఎం(Machilipatnam RTC DM), ఉయ్యూరు డిపో ఇన్​ఛార్జ్(Uyyuru Depot Incharge) స్పందిస్తూ, “లేడీ కండక్టర్ ప్రయాణికుడిపై దాడి చేసిన తీరును మేము సమీక్షిస్తాం. ఈ ఘ‌ట‌న‌ని మేము ఖండిస్తున్నాం. పూర్తి వివరాలు సేక‌రించి తగిన చర్యలు తీసుకుంటాం అని పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని పౌరులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Must Read
Related News