HomeతెలంగాణTGSRTC | ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త చెప్పిన ఆర్టీసీ.. ఆ టికెట్ ధ‌ర‌లు త‌గ్గింపు

TGSRTC | ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త చెప్పిన ఆర్టీసీ.. ఆ టికెట్ ధ‌ర‌లు త‌గ్గింపు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: TGSRTC | హైదరాబాద్ (Hyderabad) ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) శుభవార్తను ప్రకటించింది. “ట్రావెల్ యాజ్ యూ లైక్” (T-24) టికెట్ ధ‌ర‌ను తాత్కాలికంగా త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో (RTC) ప్రయాణించే వారికి ఇది మంచి అవకాశం. ఈ టికెట్‌తో సిటీ ఆర్డినరీ, సబ్ అర్బన్, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా అనేకసార్లు ప్రయాణించవచ్చు. కొద్ది వారాల క్రితం ఈ టికెట్ ధరలను ఆర్టీసీ పెంచిన నేపథ్యంలో ప్రయాణికుల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది.

TGSRTC | పెరిగిన ధరలు ఇలా..

  • సాధారణ ప్రయాణికులకు ₹120 నుండి ₹150కి పెంచారు
  • సీనియర్ సిటిజన్స్‌ (Senior Citigens)కు ₹100 నుండి ₹120కి పెంచారు
  • పిల్లలకు: ₹80 నుంచి ₹100కి పెంచారు
  • ఆధార్ కార్డు లేకుండా ప్రయాణించే మహిళలకు ₹100 నుండి ₹120కి పెంచారు.

తాజా తగ్గింపు ప్రకారం (ఆగస్టు 15 నుంచి 31 వరకు) ధ‌ర‌లు చూస్తే..

  • సాధారణ ప్రయాణికులకు: ₹150 నుండి ₹130కి త‌గ్గించారు
  • సీనియర్ సిటిజన్స్, మహిళలకు (ఆధార్ లేకుండా) ₹120 నుండి ₹110కి త‌గ్గించారు.
  • పిల్లలకు(Kids) ₹100 నుండి ₹90కి త‌గ్గించారు.

ఈ తాత్కాలిక తగ్గింపు ప్రయాణికులకు ఊరట కలిగించనుంది. బస్సు ప్రయాణాన్ని Bus Journey మరింత సౌకర్యవంతంగా, సరసమైనదిగా మార్చే దిశగా ఈ చర్యలో ఆర్టీసీ ముందడుగు వేసినట్లు కనిపిస్తోంది.