7
అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy RTC | కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్‌గా బదిలీపై వచ్చిన దినేష్ గురువారం కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను (Collector Ashish Sangwan) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూలబొకేను అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లాలో ఆర్టీసీ బస్సులు (RTC Buses) నిర్ణీత సమయానికి ప్రయాణికులను గమ్యానికి చేర్చేలా ప్రణాళికాబద్ధంగా బస్సులను నడిపించాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులు, మహిళలకు, సాధారణ ప్రయాణికుల ప్రయాణానికి ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా పర్యవేక్షించాలని డీఎంకు సూచించారు.