అక్షరటుడే, వెబ్డెస్క్ : TGSRTC | హైదరాబాద్లోని చర్లపల్లిలో రైల్వే స్టేషన్ను charlapalli railway station కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ secundrabad railwat station లో ఆధునికీకరణ పనుల్లో భాగంగా చాలా రైళ్లను చర్లపల్లి నుంచి నడుపుతున్నారు. అయితే చర్లపల్లి రైల్వే స్టేషన్కు ఇన్ని రోజులు ఆర్టీసీ బస్సు rtc bus సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఈ క్రమంలో టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి రైల్వే స్టేషన్కు నగరంలోని పలు ప్రాంతాలకు బస్సులు నడపనున్నట్లు తెలిపింది. కొండాపూర్, సికింద్రాబాద్, మెహిదీపట్నం, సుచిత్ర, మణికొండ, అఫ్జల్ గంజ్, బోరబండా, పటాన్చెరు నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్కు బస్సులు నడుపుతామని తెలిపింది. ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరింది.
TGSRTC | ప్రయాణికులకు గుడ్న్యూస్.. చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్సులు
Published on
