Homeతాజావార్తలుRtc Bus Tipper Collision | మ‌రో బ‌స్సు ప్ర‌మాదం.. టిప్ప‌ర్ ఢీకొనడంతో 17 మంది...

Rtc Bus Tipper Collision | మ‌రో బ‌స్సు ప్ర‌మాదం.. టిప్ప‌ర్ ఢీకొనడంతో 17 మంది దుర్మరణం

Rtc Bus Tipper Collision | రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఈ రోజు ఉదయం భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాండూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును ఒక టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Rtc Bus Tipper Collision | రంగారెడ్డి జిల్లా Rangareddy district లోని చేవెళ్ల Chevella మండలం మీర్జాగూడ Mirjaguda సమీపంలో సోమవారం (నవంబరు 3) భయానక రోడ్డు ప్రమాదం సంభవించింది.

తాండూరు Tandur డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో అతి వేగంగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది అక్కడికక్కడే మృతి చెందారు.

మరికొందరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌ – బీజాపూర్ జాతీయ రహదారి Hyderabad – Bijapur National Highway పై దూసుకెళ్తున్న టిప్పర్ వేగం నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పి బస్సును ఢీకొట్టింది.

ఈ క్ర‌మంలో లారీలోని కంకర మొత్తం బస్సుపై పడింది. దీంతో బస్సులోని పలువురు ప్రయాణికులు కంకర కింద ఇరుక్కుపోయారు.

Rtc Bus Tipper Collision | మ‌రో బ‌స్సు ప్ర‌మాదం.. టిప్ప‌ర్ ఢీకొనడంతో 17 మంది దుర్మరణం
Rtc Bus Tipper Collision | మ‌రో బ‌స్సు ప్ర‌మాదం.. టిప్ప‌ర్ ఢీకొనడంతో 17 మంది దుర్మరణం

Rtc Bus Tipper Collision | విద్యార్థులే ఎక్కువగా..

తాండూరు Tandur నుంచి బయల్దేరిన బస్సు హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 70 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

వారిలో చాలా మంది విద్యార్థులుగా గుర్తించబడ్డారు. ఆదివారం సెలవు ముగించుకొని సొంతూరు నుంచి తిరిగి నగరానికి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ టీమ్‌లు ఘటనాస్థలికి చేరుకుని, పొక్లెయిన్​ల సాయంతో కంకర లోడును తొలగించి సహాయక చర్యలు చేపట్టారు.

మ‌రో బ‌స్సు ప్ర‌మాదం.. టిప్ప‌ర్ ఢీకొనడంతో 17 మంది దుర్మరణం
మ‌రో బ‌స్సు ప్ర‌మాదం.. టిప్ప‌ర్ ఢీకొనడంతో 17 మంది దుర్మరణం

గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్‌–బీజాపూర్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాల రద్దీని నియంత్రించేందుకు పోలీసులు ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తున్నారు.

ప్రాథమిక దర్యాప్తులో టిప్పర్ Tipper డ్రైవరు అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.