అక్షరటుడే, గాంధారి: Gandhari Mandal | కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు (RTC Bus) అదుపుతప్పింది. ఈ ఘటన గాంధారి మండలంలోని (Gandhari Mandal) మంగళవార ఉదయం చోటు చేసుకుంది.
వివరాళ్లోకి వెళ్తే.. బాన్సువాడ డిపోకు (Banswada Depot) చెందిన బస్సు సీతాయిపల్లి (Seetaipally) మీదుగా ఎల్లారెడ్డి వెళ్తున్న క్రమంలో రోడ్డు సరిగా లేనందున సీతాయిపల్లి శివారులో అదుపు తప్పి రోడ్డు కిందికి దిగబడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో ఎక్కువ మంది ప్రయాణికులు లేకపోవడం.. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పిందని గ్రామస్థులు పేర్కొన్నారు.
Gandhari Mandal | శిథిలావస్థలో రోడ్లు..
బాన్సువాడ నుంచి సీతాయిపల్లికి (Banswada to Seetaipally) వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతలు పడడం.. ఇరుకుగా మారడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్థులు పేర్కొంటున్నారు. అనేకసార్లు ఈ రోడ్డును బాగు చేయాలని సంబంధిత అధికారులకు పేర్కొన్నప్పటికీ స్పందించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.