Homeక్రైంKKY Highway | కేకేవై రహదారిపై ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. పలువురికి తీవ్రగాయాలు

KKY Highway | కేకేవై రహదారిపై ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. పలువురికి తీవ్రగాయాలు

- Advertisement -

అక్షరటుడే, లింగంపేట: KKY Highway | కేకేవై రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లింగంపేట మండలం (Lingampeta mandal) ఎల్లమ్మ తండా సమీపంలో శనివారం సాయంత్రం యాక్సిడెంట్​ జరిగింది. బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళ్తే.. లింగంపేట నుంచి కామారెడ్డికి (Kamareddy) వెళ్తున్న ఆర్టీసీ బస్సు, కామారెడ్డి నుంచి లింగంపేట వైపు వస్తున్న లారీ ఎదురెదురుగా ఎల్లమ్మ తండా వద్ద ఢీకొన్నాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. బస్సులో వందమందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే లారీ డ్రైవర్​ సైతం తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Must Read
Related News