అక్షరటుడే, బోధన్ : Bodhan | పారిశుధ్య కార్మికురాలిని ఆర్టీసీ బస్సు (RTC Bus) ఢీకొన్న ఘటన బోధన్ పట్టణంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు.
బోధన్ మున్సిపాలిటీలో రాజం నాగమణి పారిశుధ్య కార్మికురాలిగా పని చేస్తోంది. సోమవారం ఉదయం ఆమె రోడ్లు శుభ్రం చేస్తుండగా.. బాన్సువాడ వైపు వెళ్తున్న బస్సు ఢీకొంది. అనంతరం ఆమెను కొంతదూరం బస్సు లాక్కెళ్లింది. దీంతో నాగమణికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమె ఒక కాలు నుజ్జునుజ్జయింది. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు నిజామాబాద్‌కు రిఫర్ చేశారు.
