అక్షరటుడే, వెబ్‌డెస్క్ : RTC Bus Falls Into Valley | ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) ఉట్నూర్ మండలం శ్యాంపూర్ గ్రామంలో సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఆసిఫాబాద్ డిపో (Asifabad Depot)కు చెందిన బస్సు శ్యాంపూర్ వద్ద వంతెనపై నుంచి పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
శ్యాంపూర్ (Shampur) వద్ద వంతెన ఇరుకుగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనలో డ్రైవర్, కండక్టర్‌తో సహా పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. రాష్ట్రంలో ఇటీవల ఆర్టీసీ బస్సులు (RTC Buses) తరచూ ప్రమాదాలకు గురి అవుతున్నాయి. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
