అక్షరటుడే, బాన్సువాడ: Banswada | ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన బాన్సువాడ మున్సిపాలిటీ (Banswada Municipality) శివారులో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బాన్సువాడ నుంచి ఎల్లారెడ్డి (Banswada to Yellareddy) వైపు వెళ్తున్న బస్సు స్టీరింగ్ ఒక్కసారిగా ఎడమవైపుకు లాగింది.
దీంతో బస్సు నియంత్రణ తప్పి డివైడర్ పైకి దూసుకెళ్లిందని డ్రైవర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ ఘటనలో బస్సు ముందు భాగంలోని రెండు టైర్లు ఊడిపోయాయి. బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉండగా, డ్రైవర్, కండక్టర్‌తో కలిపి 11 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి (Banswada Area Hospital) తరలించి చికిత్స అందిస్తున్నారు. అదుపు తప్పి ఓ ఆర్టీసీ బస్సు డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటన బాన్సువాడ శివారులో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది.