Homeక్రైంRTC bus | ఆర్టీసీ బస్సు ఢీ: తాత మనవడి దుర్మరణం

RTC bus | ఆర్టీసీ బస్సు ఢీ: తాత మనవడి దుర్మరణం

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: RTC bus | టీవీఎస్​ ఎక్సెస్​ను(TVS XL) ఆర్టీసీ బస్సు (RTC Bus) ఢీకొనడంతో తాతా మనవడు మృతి చెందిన ఘటన రాజంపేట (Rajampet) మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బస్వన్నపల్లి గ్రామానికి చెందిన దోమకొండ నడిపి రాములు(50) తన మనవడు శ్రీహాన్స్(4)కు కుక్క కరవడంతో రాజంపేట పీహెచ్​సీకి టీవీఎస్ ఎక్సెస్​పై వెళ్లారు.

పీహెచ్​సీలో వైద్యుల పరీక్షల నిమిత్తం తిరిగి వెళ్తుండగా.. రాజంపేట వైపు వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఎక్సెస్​ వాహనాన్ని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో బస్సు కింద ఎక్సెల్ వాహనం ఇరుక్కుపోవడంతో తాత మనవడు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు టైరు కింద రాములు ఇరుక్కుపోగా మనవడు శ్రీహన్స్ పక్కకు ఎగిరిపడ్డాడు. బస్సు కింద ఇరుక్కున్న వాహనాన్ని జేసీబీ సాయంతో బయటకు తీశారు. సమాచారం తెలియడంతో గ్రామస్తులు పెద్దఎత్తున రాజాంపేటకు చేరుకున్నారు. తాత మనవడి మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

Must Read
Related News