అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. ఆదివారం రాత్రి మండలంలోని అన్నాసాగర్ గేటు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
మహమ్మద్ నగర్ మండలం నర్వ గ్రామానికి చెందిన బెస్త అంజయ్య బొగ్గు గుడిసె నుంచి ఎక్సెల్ వాహనంపై నర్వకు వెళ్తున్నాడు. అన్నాసాగర్ గేటు సమీపంలో ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.