అక్షరటుడే, ఇందూరు: Mallaram Gandi | నిజామాబాద్ రూరల్ మండలం పరిధిలోని మల్లారం గండిలో గురువారం ఆర్టీసీ బస్సు.. ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నిజామాబాద్ రూరల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్షత్రగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
