అక్షరటుడే, వెబ్డెస్క్: Sangareddy | సంగారెడ్డిలో జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న టిప్పర్ను ఆర్టీసీ బస్సు (RTC bus) ఢీకొంది.
కంది దగ్గర NH 65పై రోడ్డు ప్రమాదం జరిగింది. మెదక్ నుంచి పటాన్చెరు (Medak to Patancheru) వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొంది. ఈ ఘటనలో 22 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి (District Government General Hospital) తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదంతో ట్రాఫిక్ జామ్ కావడంతో క్లియర్ చేశారు.
Sangareddy | నిర్లక్ష్యంతోనే..
ఆర్టీసీ డ్రైవర్ (RTC bus driver) నిర్లక్ష్యంగా నడపడంతోనే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపించారు. లారీని ఢీకొట్టడానికి ముందు స్కూటీని కూడా ఢీకొట్టాడని తెలిపారు. ప్రయాణికుల ఫిర్యాదుతో ఆర్టీసీ డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. ఆస్పత్రిలో కరెంట్ లేక, సిటీ స్కాన్ కోసం క్షతగాత్రులు నానా తంటాలు పడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వసతులు లేకపోతే ఎలా అని ప్రశ్నించారు.
Sangareddy | వరుస ప్రమాదాలు
ఇటీవల రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. ముఖ్యంగా ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు తరచూ ప్రమాదాలకు గురి అవుతుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. బస్సు ఎక్కాలంటేనే భయ పడుతున్నారు. చలికాలం కావడంతో పొగమంచు ప్రభావంతో తెల్లవారుజామున అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులు, డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.