Homeజిల్లాలునిజామాబాద్​RTC bus | మందుబాబు వీరంగం.. ఆర్టీసీ బస్సుపై బీరు సీసాతో దాడి.. ప్రయాణికుల ఆందోళన!

RTC bus | మందుబాబు వీరంగం.. ఆర్టీసీ బస్సుపై బీరు సీసాతో దాడి.. ప్రయాణికుల ఆందోళన!

ఆలూరులో ఆర్టీసీ బస్సుపై ఓ మందుబాబు బీరు సీసాతో దాడికి దిగాడు. దీంతో దాని హెడ్​లైట్​ ధ్వంసం అయింది. ఈ ఘటన గ్రామంలోని అంబేడ్కర్​ విగ్రహం సమీపంలో చోటుచేసుకుంది.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: RTC bus | మందుబాబులు Drug addicts వీరంగం సృష్టిస్తున్నారు. తాగితే లోకమంతా నాదంటున్నారు. కన్నూమిన్ను కానరాకుండా ప్రవర్తిస్తున్నారు.

దారిన తూలుతూ పోతూ.. రోడ్డుపై వెళ్లేవారిని దూర్భాషలాడుతున్నారు. ఎవరై పడితే వారిపై దాడులకు తెగబడుతున్నారు. తాగుబోతులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారు.

మద్యం మత్తులో ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారు. తాజాగా నిజామాబాద్​ జిల్లా Nizamabad district ఆలూరు మండల కేంద్రంలో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు.

ఏకంగా ఆర్టీసీ బస్సుపైనే దాడికి తెగబడ్డాడు. తాగుబోతు చర్యతో తిక్కరేగిన ప్రయాణికులు బస్సును అక్కడే ఆపేసి నిరసనకు దిగారు.

RTC bus | ప్రయాణికుల కథనం ప్రకారం..

ఆర్మూర్ Armoor నుంచి నందిపేట్ Nandipet వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. ఆలూరుకు చేరుకోగానే ఓ మందుబాబు drunkard చేతిలోని బీరు సీసాను విసిరాడు.

దీంతో బస్సు హెడ్​లైట్​ ధ్వంసం అయింది. ఈ ఘటన ఆలూరు (Aluru) లోని అంబేడ్కర్​ విగ్రహం సమీపంలో చోటుచేసుకుంది.

బస్సుపై దాడిచేసిన సదరు తాగుబోతు.. అందులోని ప్రయాణికులపైనా విరుచుకుపడ్డాడు. నోటికొచ్చినట్లు దూర్భాషలాడాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ప్రయాణికులు అందరూ బస్సు దిగారు. రోడ్డుపై ధర్నా చేపట్టారు.

విషయం తెలిసి ఆర్మూర్​ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రయాణికులను సముదాయించారు. బస్సు డ్రైవరు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.