అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Nizamabad City | నగర శివారులో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కంఠేశ్వర్ బైపాస్ వద్ద తెల్లవారుజామున హైదరాబాద్ (Hyderabad) నుంచి ఆర్మూర్ (Armoor) వైపు పక్కపక్కనే వెళ్తున్న లారీ, ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొన్నాయి.
ఆ సమయంలో నిజామాబాద్ డిపో–1కు (Nizamabad Depot-1) చెందిన ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సులో (Electrical RTC bus) ఒకే ఒక్క ప్రయాణికుడు ఉన్నాడు. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. రూరల్ పోలీసులు (Nizamabad Rural Police) కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.