6
అక్షరటుడే, ఆర్మూర్: Armoor | ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న ఘటనలో తండ్రీకొడుకులు తీవ్రంగా గాయపడ్డ ఘటన వేల్పూర్(Velpoor) సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏర్గట్ల మండలం గుమ్మిర్యాల గ్రామానికి చెందిన తండ్రీకొడుకు ఇద్దరు బైక్‌పై మోర్తాడ్ నుంచి ఆర్మూర్‌కు వెళ్తున్నారు. వేల్పూర్ టర్నింగ్ వద్ద భీంగల్(Bheemgal) వెళ్తున్న బస్సు వీరిని ఢీకొట్టింది. దీంతో తండ్రీకొడుకు గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.