అక్షరటుడే, మెండోరా : RTC Bus Accident Mendora | ఆర్టీసీ బస్సు (RTC Bus) ఢీకొని వ్యవసాయ కూలీ మృతి చెందాడు. ఈ ఘటన మెండోరా (Mendora) మండలం బుస్సాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది.
ఎస్సై సుహాసిని (SI Suhasini) తెలిపిన వివరాల ప్రకారం.. బుస్సాపూర్ గ్రామానికి చెందిన ధోని పోశెట్టి (56) వ్యవసాయ పనులు ముగించుకుని తన టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఈక్రమంలో బుస్సాపూర్ గ్రామ శివారులోని యూటర్న్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పోశెట్టికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం నిర్మల్ ఆస్పత్రి (Nirmal Hospital)కి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య ధోనీ వినోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని మెండోరా ఎస్సై సుహాసిని తెలిపారు.
