అక్షరటుడే ఇందల్వాయి: Travels Buses | కర్నూలు (Kurnool) జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రావెల్స్ బస్సుకు నిప్పంటుకుని 20 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా ట్రావెల్స్ బస్సులను అధికారులు తనిఖీ చేస్తున్నారు.
Travels Buses | ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద..
ఇందల్వాయి టోల్‌ప్లాజా (Indalwai Toll Plaza) వద్ద శనివారం ఆర్టీఏ అధికారులు (RTA Nizamabad) ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు, ఫిట్నెస్ ఉండాలని అధికారులు సూచించారు. ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్డుపైకి వస్తే కఠినచర్యలు తప్పవని వారు హెచ్చరించారు. వాహనాల తనిఖీల్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు పవన్ కళ్యాణ్, శృతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
