అక్షరటుడే, ఇందూరు: RSS Nizamabad | రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (Rashtriya Swayam sevak Sangh) ఆధ్వర్యంలో నగరంలోని కోటగల్లి (Kotagally) ఉపనగర పథ సంచలన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మార్కండేయ మందిరం (Markandeya Temple) నుంచి ప్రారంభమైన పథ సంచలన్ అశోక్ వీధి ఆర్య సమాజ్(Arya Samaj) పెద్ద బజార్ తిరిగి గోల్ హనుమాన్ మార్కండేయ మందిరానికి చేరుకుంది.
కార్యక్రమ సమయానికి జోరువాన కురిసినా.. స్వయం సేవకులు అలాగే ముందుకు సాగారు. కార్యక్రమంలో నగర కార్యవాహ సత్యం, ఉప కార్యవాహ వెంకటేష్, సుమిత్, జిల్లా వ్యవస్థ ఆర్మూర్ దత్తు, కాశ రామన్న, కోటగల్లి ఉపనగర కార్యవాహ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
