అక్షరటుడే, ఇందూరు: RSS Indur | రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (Rashtriya Swayamsevak Sangh) ఇందూరు నగర మహా పథ సంచలన్ను (RSS Path sanchalan) ఆదివారం ఘనంగా నిర్వహించారు. నగరంలోని చంద్రశేఖర్ నగర్ కాలనీలో ఉన్న హెచ్పీఎస్ పాఠశాల నుంచి కార్యక్రమం ప్రారంభమైంది.
కాషాయ ధ్వజానికి ప్రణామం చేసిన అనంతరం చంద్రశేఖర్ కాలనీ(Chandrasekhar Colony) కంఠేశ్వర్ రోడ్ (కంఠేశ్వర్) ఉమెన్స్ కాలేజ్ మీదుగా తిరిగి హెచ్పీఎస్ పాఠశాలకు చేరుకుంది. పథ సంచలన్లో చిన్నారులు అమితంగా ఆకట్టుకున్నారు.
ఈ ముగింపు కార్యక్రమంలో ముఖ్యవక్తగా విచ్చేసిన ఇందూర్ విభాగ ప్రచారక్ శివకుమార్ మాట్లాడుతూ సంఘం గత వందేళ్లుగా దేశంలో హిందూ సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తోందన్నారు. సమాజంలో చైతన్యాన్ని నింపి ఈ దేశాన్ని విశ్వ గురువుగా నిలవడానికి ప్రయత్నిస్తోందని స్పష్టం చేశారు.
RSS Indur | నవంబర్లో జన జాగరణ
అందులో భాగంగా నవంబర్ మాసంలో ఇంటింటికి జన జాగరణ పేరుతో వెళ్లి సంఘ శతాబ్ది సందేశాన్ని పంచ పరివర్తన ద్వారా అందజేస్తారని పేర్కొన్నారు. బాలలు సైతం శ్రమకోచ్చి 3 కి.మీ సంచలన్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో విభాగ ప్రచారక్తో పాటు జిల్లా సంఘచాలకులు డాక్టర్ కాపర్తి గురుచరణం, నగర కార్యవాహ అర్గుల సత్యం, విభాగ సహకార్యవాహ వరంగంటి శ్రీనివాస్, ఉప కార్యవాహ వెంకటేష్, సుమిత్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (Mla Dhanpal), మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
