అక్షరటుడే, గాంధారి: RSS | దేశంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (Rashtriya Swayamsevak Sangh) ప్రజలకు అండగా నిలిచిందని ఇందూరు విభాగ్ (Indur Vibhag) ఘోష్ ప్రముఖ్ నాగభూషణం అన్నారు. మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్లో సోమవారం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విజయదశమి కార్యక్రమం నిర్వహించారు.
కామారెడ్డి జిల్లా ఆర్ఎస్ఎస్ (Kamareddy RSS) సహ కార్యవాహ రెడ్డి సాయిలు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్వయం సేవక్ తాటి దర్శన్ గుప్తా, నాగభూషణం విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 122 మంది స్వయం సేవకులు గణవేష్ ధరించడం సంతోషంగా ఉందన్నారు.
సమాజంలో ప్రస్తుతం పంచ పరివర్తన్ (Pancha Parivartan) ఆవశ్యకతను గురించి తెలసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆర్ఎస్ఎస్ 1925లో ప్రారంభమై 2025 వరకు 100 ఏళ్లు పూర్తి చేసుకుందన్నారు. భారతదేశంలో ఆర్ఎస్ఎస్ ఏవిధంగా ముందుకెళ్లింది.. అత్యవసర పరిస్థితుల్లో దేశం కోసం ఎలా పోరాడిందనే విషయాలను వారు వివరించారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ స్థాపకులు డాక్టర్ హెగ్డేవార్ అనేక సవాలను ఎదుర్కొని సంఘాన్ని స్థాపించారన్నారు. ఆర్ఎస్ఎస్ను మాధవ సదాశివ గోల్వాల్కర్ పటిష్టమైన పునాదులు వేసి ఆర్ఎస్ఎస్ను నిలబెట్టారని వివరించారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.