అక్షరటుడే, బోధన్ : RSS | సాలూర మండల (Salura Mandal) కేంద్రంలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందూరు ధర్మ జాగరణ కార్యకర్త సాయిరాం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1925 సెప్టెంబర్ 27వ తేదీన విజయదశమి (Vijaya Dashami) రోజున ఆర్ఎస్ఎస్ (RSS) హెడ్గేవార్ ప్రారంభించారన్నారు. అనాడు హెడ్గేవార్తో సహా.. ఎంతో మంది ప్రముఖులు వ్యయ ప్రయాసలకు ఓర్చి సంస్థను ముందుకు నడిపిస్తూ వచ్చారన్నారు. ఆర్ఎస్ఎస్ ముఖ్య ఉద్దేశం వ్యక్తిత్వ నిర్మాణమని వివరించారు. వ్యక్తి నిర్మాణంతోనే దేశాభివృద్ధి జరుగుతుందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు అల్లె సాయన్న, ఇల్తెం శంకర్, రాజు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.