Homeజిల్లాలునిజామాబాద్​RSS | ముప్కాల్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది ఉత్సవం

RSS | ముప్కాల్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది ఉత్సవం

ముప్కాల్​ మండల కేంద్రంలో ఆర్​ఎస్​ఎస్​ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్​ఎస్​ఎస్​ ప్రస్థానాన్ని వక్తలు వివరించారు.

- Advertisement -

అక్షరటుడే, ముప్కాల్‌:  RSS | మండల కేంద్రంలోని భూదేవి ఇండోర్‌ స్టేడియంలో ఆదివారం ఆర్‌ఆర్‌ఎస్‌ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ముందుగా ముప్కాల్​ శాఖ (Mukpal) ఆధ్వర్యంలో ధ్వజ ప్రమాణ కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బింపెల్లి భూమేశ్వర్, ముఖ్య వక్తగా విభాగ్‌ సంపర్క్‌ కొట్టూరి శ్రీధర్‌ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్‌ఆర్‌ఎస్‌ వందేళ్ల ఘన చరిత్రను ప్రతి హిందువు తెలుసుకోవాలన్నారు. దేశ సేవలో, సామాజిక సమగ్రతలో సంస్థ పాత్ర అపారమన్నారు.

కార్యక్రమంలో తాడూరి గంగాధర్, భరత్‌ స్వరూప్, జీవన్, దినేష్, ముస్కు భూమేశ్, నాయకుడు సంతోష్, లింగం, చిల్క గోపాల్, గడ్డం సంతోష్, దాసరి నరేష్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామ యువకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేశారు.