అక్షరటుడే, వెబ్‌డెస్క్ : RSS | భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (operation sindoor), అనంతర పరిణామాలపై రాష్ట్రీయ్ స్వయం సేవక్ సంఘ్ (Rashtriya Swayamsevak Sangh) స్పందించింది.
పహల్గామ్లో పర్యాటకులపై దాడి చేసిన ఉగ్రవాదులకు (terrorist attack on Pahalgam tourists) సరైన జవాబు చెప్పిందని సంఘ్ పేర్కొంది. ఉగ్రదాడి బాధితులకు (terror attack) ఈ ఆపరేషన్‌తో న్యాయం జరిగిందని.. ఉగ్రవాదులు, ఉగ్ర స్థావరాలపై దాడులు (attack on terrorists and terror camps) చేయడం దేశ భద్రత దృష్ట్యా అవసరమని అభిప్రాయపడింది. భారత్‌లోని సామాన్య పౌరులపై పాక్ దాడులను ఆర్ఎస్ఎస్ (RSS) ఖండించింది. ఇలాంటి సంక్షోభ సమయంలో దేశం మొత్తం సాయుధ దళాలకు అండగా నిలవాలని పేర్కొంది. పాక్ దాడుల్లో మృతి చెందిన వారికి సంతాపం తెలిపింది. ప్రజలు ఐక్యతతో ఉంటూ దేశభక్తిని ప్రదర్శించి ప్రభుత్వం చెప్పిన సూచనలు పాటించాలని ఆర్ఎస్ఎస్ కోరింది.