అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad City | నగరంలో ట్రాఫిక్ పోలీసులు (Traffic Police), ఆర్టీవో అధికారులతో కలిసి గురువారం వాహనాల తనిఖీ చేపట్టారు. నిబంధనలు పాటించని తొమ్మిది ప్రైవేట్ బస్సులకు రూ.53 వేల జరిమానా విధించారు.
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ (Traffic ACP Mastan Ali), ఇన్స్పెక్టర్ ప్రసాద్, సౌత్ రూరల్ సీఐ సురేష్, ఆరో టౌన్ ఎస్హెచ్వో వెంకట్రావు, ఆర్టీవో అధికారులతో ఆరో టౌన్ పరిధిలో గల డైరీ ఫార్మ్ కమాన్ వద్ద స్కూల్ బస్సులు, ట్రావెల్ బస్సులను తనిఖీ చేశారు. నియమాలను పాటించని తొమ్మిది బస్సుల మీద 52,900/- జరిమానా విధించారు. ఒక స్కూల్ బస్సును సీజ్ చేశారు.
తనిఖీ సమయంలో బస్సులలో ఎమర్జెన్సీ డోర్లు సరిగా పనిచేయకపోవడం, అగ్నిమాపక నిరోధక పరికరాలు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేకపోవడం, సరైన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడాన్ని అధికారులు గమనించారు. బస్సుల్లో నిబంధనల ప్రకారం అన్ని వస్తువులు, పత్రాలు ఉండాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ హెచ్చరించారు.

