అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Constable Murder Case | కానిస్టేబుల్ ప్రమోద్ (Constable Pramod)ను హత్య చేసిన నిందితుడు రియాజ్‌ను పట్టిస్తే రూ.50 వేల రివార్డు అందిస్తామని సీపీ సాయి చైతన్య తెలిపారు. కానిస్టేబుల్ మృతి చెందడం బాధాకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు.
నిందితుడి పట్టుకోవడానికి పోలీసుల బృందం వెళ్లిందని సీపీ తెలిపారు. వివిధ దొంగతనాలకు, దోపిడీకి, హత్యలకు పాల్పడిన నిందితుడు షేక్ రియాజ్ (24) గురించి తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సీపీ సూచించారు. రియాజ్‌కు సంబంధించిన సమాచారం తెలిపిన వారికి రూ.50 వేలు రివార్డు అందిస్తామన్నారు. నిందితుడి ఆచూకీ తెలిస్తే డయల్ 100కు గాని 8712659793 లేదా 8712659777 అని నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Constable Murder Case | పరామర్శించిన సీపీ, నుడా ఛైర్మన్ కేశ వేణు
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (Commissioner Sai Chaitanya) శుక్రవారం అర్ధరాత్రి పరామర్శించారు. తమలోని ఒక కుటుంబ సభ్యున్ని కోల్పోవడం బాధాకరమన్నారు. పోలీసు శాఖ ప్రమోద్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నుడా ఛైర్మన్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశ వేణు (Kesha Venu) శనివారం ఉదయం ప్రమోద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కానిస్టేబుల్ ప్రమోద్ పార్థీవదేహానికి నివాళులు అర్పిస్తున్న నుడా ఛైర్మన్ కేశ వేణు