Homeతాజావార్తలుKavitha Janam Bata | ఎకరాకు రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలి : కవిత

Kavitha Janam Bata | ఎకరాకు రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలి : కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనం బాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామంలో పర్యటించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kavitha Janam Bata | వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ. 50 వేల పరిహారం ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) డిమాండ్​ చేశారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆమె కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామంలోని (Makthapalli Village) ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.

జాగృతి జనంబాట కార్యక్రమాన్ని కవిత ఈ నెల 25న ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ఈ యాత్ర నాలుగు నెలల పాటు సాగనుంది. శుక్రవారం యాత్రలో భాగంగా కరీంనగర్​ జిల్లాలో (Karimnagar District) ఆమె పర్యటించారు. మక్తపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని (Purchasing Center) సందర్శించారు. రైతులతో మాట్లాడారు. గ్రామంలో వర్షానికి నేలవాలిన వరి పొలాలను పరిశీలించారు.

Kavitha Janam Bata | కొనుగోళ్లలో జాప్యం

కవిత మాట్లాడుతూ.. వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తామంటే ఏ మూలకు సరిపోవని కవిత అన్నారు. ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడిగా కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. మానవతా దృక్పథంతో ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరారు. మొలకెత్తినా, బూజు పట్టినా, తేమ శాతం ఎక్కువ ఉన్నా సరే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని ఆమె పేర్కొన్నారు. యాసంగి పంటల సాగు కోసం రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు ఇవ్వడంతో పాటు రైతు భరోసా (Rythu Bharosa) సాయాన్ని త్వరగా విడుదల చేయాలని ఆమె కోరారు.