Homeక్రైంMir Chowk | అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం

Mir Chowk | అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mir Chowk | హైదరాబాద్ hyderabad​ పాతబస్తీలోని మీర్​చౌక్ Mir Chowk​లో గుల్జార్​ హౌస్​ అగ్ని ప్రమాదం fire accident పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క bhatti vikramarka స్పందించారు. ఆదివారం ఉదయం గుల్జార్​ హౌస్​లో అగ్నిప్రమాదం జరిగి 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం భట్టి ఘటన స్థలానికి వెళ్లి పరామర్శించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున పరిహారం Compensation ఇస్తామని ఆయన తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి CM revanth reddy మాట్లాడారన్నారు. షార్ట్ సర్క్యూట్​తో అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని భట్టి విక్రమార్క తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందన్నారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

అగ్నిప్రమాద ఘటనపై కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్​ ఖర్గే, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారు ఘటనపై సీఎం రేవంత్​రెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మాజీ సీఎం, బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ సైతం ప్రమాదంపై స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరారు.

Must Read
Related News