అక్షరటుడే, భీమ్‌గల్: Limbadri gutta | మండలంలోని లింబాద్రిగుట్ట ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 4కోట్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బొదిరె స్వామి తెలిపారు. భీమ్‌గల్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ (PCC President Mahesh Kumar Goud) చొరవతో పర్యాటక శాఖ నుంచి హోటల్ (హరిత హోటల్) (Haritha Hotel) నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు.
నిధుల మంజూరుకు కృషి చేసిన కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ (Balkonda Constituency) ఇన్‌ఛార్జి సునీల్ కుమార్ రెడ్డి (Sunil kumar Reddy), టీజీఎండీసీ ఛైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్ (TGMDC Chairman Eravatri Anil Kumar), సహకార యూనియన్ ఛైర్మన్, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, సీడ్స్ కార్పొరేషన్ (Seeds Corporation) ఛైర్మన్ అన్వేష్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు జేజే నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, కార్యదర్శి భోజాగౌడ్, మాజీ ఎంపీపీ సురేందర్, తదితరులు పాల్గొన్నారు.