ePaper
More
    HomeజాతీయంTamil Nadu | ఆస్తులు కావాలని వేధించిన కుమార్తెలు.. రూ.నాలుగు కోట్ల విలువైన ఆస్తిని ఆలయానికి...

    Tamil Nadu | ఆస్తులు కావాలని వేధించిన కుమార్తెలు.. రూ.నాలుగు కోట్ల విలువైన ఆస్తిని ఆలయానికి విరాళం ఇచ్చిన తండ్రి..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Tamil Nadu | ప్రస్తుతం తల్లిదండ్రుల కంటే వారి ఆస్తులను ప్రేమించే పిల్లలే ఎక్కువగా ఉన్నారు. వృద్ధాప్యంలో కన్నవారికి అండగా ఉండాల్సిన పిల్లలు పట్టించుకోవడం లేదు. తమ కళ్ల ముందే ఆస్తుల కోసం గొడవలు పడుతుండడంతో ఎంతో మంది తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతున్నారు. జీవిత చరమాంకంలో తమకు తోడుగా ఉండాల్సిన పిల్లలను తమను వదిలేసి ఆస్తులు కావాలంటూ వేధిస్తుండడంతో కుమిలి పోతున్నారు. అయితే తమిళనాడు(Tamil Nadu)కు చెందిన ఓ వ్యక్తి మాత్రం అలా కుమిలిపోయి ఆగిపోలేదు. తాను కష్టపడి సంపాదించిన ఆస్తి కోసం కుమార్తెలు బెదిరించడంతో ఆవేదనకు లోనైనా ఆ తండ్రి.. రూ.నాలుగు కోట్ల విలువైన ఆస్తి పత్రాలను ఆలయ హుండీలో వేశారు.

    తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా(Tiruvannamalai District) అరణి సమీపంలోని కోనైయూర్ గ్రామానికి చెందిన విజయన్ ఆర్మీ జవాన్(Army soldier)​గా పనిచేశాడు. భార్యతో కలిసి పడవేడు సమీపంలోని కలికాపురంలో నివాసం ఉంటున్నాడు. తన ఇద్దరు కూతుళ్లను ఉన్నత చదువులు చదివించాడు. ఒకరు ఉపాధ్యాయురాలిగా, మరొకరు వైద్యురాలిగా పని చేస్తున్నారు. అయితే ఆస్తి విషయంతో ఇద్దరు కుమార్తెలు విజయన్​తో గొడవ పడ్డారు. అంతేగాకుండా వారి భర్తలు సైతం ఆయనను బెదిరించారు. దీంతో విజయన్​ మనస్తాపానికి గురయ్యారు. కుమార్తెలు తన మాట వినడం లేదని ఆగ్రహంతో కష్టపడి సంపాదించిన ఆస్తిని ఆలయానికి విరాళం ఇచ్చాడు.

    Tamil Nadu | హుండీలో ఆస్తి పత్రాలు

    విజయన్​ తన రెండు ఇళ్లు, పొలాలకు సంబంధించిన ఆస్తి పత్రాలను పాతవేడు గ్రామంలోని ప్రసిద్ధ శ్రీరేణుకాంబాల్ అమ్మవారి ఆలయ హుండీ(Sri Renukambhal Ammavari temple hundi)లో వేశారు. ఆ ఆస్తుల విలువ రూ.నాలుగు కోట్ల వరకు ఉంటుందని సమాచారం. కష్టపడి సంపాదించిన ఆస్తుల విషయంలో తన కుమార్తెలు తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

    తన తండ్రి ఆస్తి పత్రాలను హుండీలో వేసిన విషయం తెలుసుకున్న కూతుళ్లు ఆలయ అధికారుల దగ్గరకు వెళ్లారు. ఆస్తి పత్రాలు తమకు ఇవ్వాలని కోరారు. తన తండ్రితో తల్లి కూడా కష్టపడి ఆస్తులు కొనుగోలు చేశారని వారు పేర్కొన్నారు. ఆస్తిలో తల్లికి కూడా వాటా ఉంటుందని అధికారులకు చెప్పారు. అయితే విరాళం వచ్చిన ఆస్తులను తిరిగి ఇవ్వడం కుదరదని ఆలయ అధికారులు వారికి స్పష్టం చేశారు. ఉన్నతాధికారులకు పత్రాలను సమర్పిస్తామని పేర్కొన్నారు. అయితే ఆస్తుల వ్యవహారం ఇప్పటికే కోర్టులో ఉందని విజయన్​ కుమారులు చెబుతున్నారు. కోర్టు తీర్పు ప్రకారం ముందుకు వెళ్తామన్నారు.

    More like this

    Kamareddy | సీఎం పర్యటన..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...