HomeతెలంగాణInterest-free loans | మహిళా సంఘాలకు శుభవార్త.. రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాల నిధులు...

Interest-free loans | మహిళా సంఘాలకు శుభవార్త.. రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాల నిధులు విడుదల

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: Interest-free loans : తెలంగాణ రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల (women’s self-help groups) కు సర్కారు శుభవార్త చెప్పింది. రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలు interest-free loans విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సెర్ప్‌ (SERP)కు ఆర్థిక శాఖ నిధులు మంజూరు చేసింది.

తెలంగాణ ప్రభుత్వం Telangana government విడుదల చేసిన .344 కోట్ల నిధుల్లో రూ. 300 కోట్లు గ్రామీణ మహిళ సంఘాలకు కేటాయించింది. మిగతా పట్టణ మహిళా సంఘాలకు రూ. 44 కోట్లు కేటాయించడం గమనార్హం. నేటి(జులై 12) నుంచి ఈ నెల 18 వరకు మహిళా సంఘాల ఖాతాల్లో ఈ నిధులను జమ చేయనున్నారు.

Interest-free loans : మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో..

వడ్డీ లేని రుణాల చెక్కులను ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు చెక్కులు పంపిణీ చేయనున్నారు. వీటితోపాటు ప్రమాద బీమా accident insurance, రుణ బీమా loan insurance చెక్కులను కూడా అందజేయనున్నట్లు సమాచారం.

వడ్డీలేని రుణాల పంపిణీ బీఆర్ఎస్ హయాంలోనే నిలిపోయిన విషయం తెలిసిందే. భారాస BRS హయాంలో అప్పట్లో సుమారు రూ. 3 వేల కోట్లకు పైగా బకాయిలు ఉండిపోయాయి. కాగా, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వడ్డీలేని రుణాల చెల్లింపుపై నిర్ణయం తీసుకున్నట్లు అధికార పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ఇందుకు మంత్రి సీతక్క Minister Seethakka ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు చెప్పారు.