అక్షరటుడే, వెబ్‌డెస్క్: ACB Trap | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. అవినీతి పరులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇంటి నిర్మాణానికి లంచం అడిగిని ముగ్గురు అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
రంగారెడ్డి జిల్లా (Rangareddy district) నందిగామ ఎంపీడీవో కార్యాలయంలో ఏసీబీ అధికారులు (ACB officials) బుధవారం సోదాలు చేశారు. ఓ వ్యక్తి నాలుగు ప్లాట్లలో ఇంటి నిర్మాణం కోసం అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. సంబంధిత రుసుము కూడా చెల్లించాడు. అయితే ఆ దరఖాస్తును ప్రాసెస్ చేసి ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వడానికి ఎంపీడీవో సుమతి, ఎంపీవో తేజ్‌సింగ్, పంచాయతీ కార్యదర్శి చెన్నయ్య లంచం డిమాండ్ చేశారు.
ACB Trap | రూ.లక్ష తీసుకుంటుండగా..
బాధితుడి నుంచి వారు రూ.2.5 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో ఆయన ఏసీబీ అధికారులకు (ACB officials) ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు బుధవారం లంచం తీసుకుంటుండగా.. ఎంపీడీవో పొన్న సుమతి, మండల పంచాయతీ అధికారి వడ్త్యావత్ తేజ్ సింగ్, ఎదులపల్లి పంచాయతీ కార్యదర్శి ఆవుల చెన్నయ్యను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేశారు.