అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | ఎల్లారెడ్డి అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ (Yellareddy Agricultural Market Committee) అభివృద్ధికి రూ.2.34 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వీటిలో కొత్త మార్కెట్ కార్యాలయం నిర్మాణం కోసం రూ.86.80 లక్షలు, 10 షాపులు నిర్మాణం కోసం రూ.83.80 లక్షలు, మార్కెట్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.18.80 లక్షలు, మరుగుదొడ్ల నిర్మాణం కోసం రూ.13 లక్షలు, వంద మెట్రిక్ టన్నుల ఎలక్ట్రానిక్ వేయింగ్ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ. 32.50 లక్షలు నిర్మించనున్నారు.
Yellareddy | 30 ఏళ్లుగా ఉన్న సమస్యలకు చెక్..
30 ఏళ్లుగా ఎల్లారెడ్డి ఏఎంసీలో (Yellareddy AMC) తగిన సదుపాయాలు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఈ విషయమై ఎమ్మెల్యే మదన్ మోహన్ స్పందించి నాగిరెడ్డిపేట, లింగంపేట, ఎల్లారెడ్డి మండలాల రైతుల అవసరాల దృష్ట్యా ప్రస్తుత ఏఎంసీ ఛైర్మన్ రజిత వెంకటరెడ్డిని నివేదిక అందించాలని ఆదేశించారు. దీంతో ఆయన నివేదిక మేరకు ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో (Minister Tummala Nageswara Rao) మాట్లాడి సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ నిధుల మంజూరుకు కృషి చేశారు.
Yellareddy | నిధుల విడుదలపై హర్షం..
ఈ సందర్భంగా ఏఎంసీ ఛైర్మన్ రజిత వెంకటరెడ్డి మాట్లాడుతూ.. మార్కెట్ కమిటీ నిధులు (Market Committee Funds) రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఏళ్లుగా మార్కెట్ కమిటీలో వసతుల్లేక రైతులు అవస్థలు పడ్డారన్నారు. దీనిని గుర్తించిన ఎమ్మెల్యే మదన్మోహన్రావు వెంటనే ప్రతిపాదనలు పంపాలని సూచించారని.. ఈ మేరకు ఎమ్మెల్యే నిధులు విడుదల చేయించారని ఆమె పేర్కొన్నారు. ఏఎంసీ అభివృద్ధికి నిధులు మంజూరు కావడంతో నాగిరెడ్డిపేట, లింగంపేట, ఎల్లారెడ్డి మండలాల రైతులు కృతజ్ఞతలు తెలిపారు.