Homeక్రైంSangareddy | మహిళల దగ్గర రూ.18 కోట్లు వసూలు.. అడిగితే రాడ్లతో దాడి చేయించిన కి‘లేడీ’

Sangareddy | మహిళల దగ్గర రూ.18 కోట్లు వసూలు.. అడిగితే రాడ్లతో దాడి చేయించిన కి‘లేడీ’

Sangareddy | సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో ఓ మహిళ పలువురి నుంచి రూ.18 కోట్లు వసూలు చేసి మోసం చేసింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sangareddy | ప్రజల ఆశను ఆసరాగా చేసుకొని పలువురు మోసాలకు పాల్పడుతున్నారు. తమ దగ్గర పెట్టుబడులు పెడితే భారీగా డబ్బులు వస్తాయని ప్రజలను నమ్మిస్తున్నారు. తీరా డబ్బులు ఇవ్వకుండా మోసాలకు పాల్పడుతున్నారు.

సంగారెడ్డి జిల్లాలో ఓ కిలాడి లేడీ బాగోతం తాజాగా వెలుగు చూసింది. మహిళలను నమ్మించి రూ.18 కోట్లు వసూలు చేసిన మహిళ అనంతరం వారిని మోసం చేసింది. డబ్బులు ఇవ్వాలని అడిగితే బాధితులపై దాడి చేయించింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

Sangareddy | మాజీ ఎమ్మెల్యే పేరు చెప్పి

ఏపీకి చెందిన ఓ వైసీపీ మాజీ ఎమ్మెల్యే (Former YSRCP MLA)  పేరు చెప్పుకుని ఓ మహిళ పలువురి నుంచి రూ.18 కోట్లు కాజేసింది. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు (Patancheru) ఏపీఆర్ గ్రాండియాలో ఉంటున్న విద్య అనే మహిళ తోటి మహిళలను మోసం చేసింది. ఏపీలోని ఓ ఎమ్మెల్యే, ఆయన పీఏ నుంచి రూ.2వేల కోట్లు వస్తున్నాయని వారిని నమ్మించింది. దీని కోసం కంటైనర్లు కొనడానికి డబ్బులు కావాలని చెప్పి మహిళల నుంచి రూ.18 కోట్లు వసూలు చేసింది. తర్వాత తీసుకున్న దానికి కంటే ఎక్కువ మొత్తం ఇస్తానని ఆశ చూపింది. అయితే ఎంతకు డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు ఆమెను ప్రశ్నించారు. దీంతో అక్టోబర్​ 9 (గురువారం) ఇస్తానని అందరికి చెప్పింది. అందరు ఒకచోటకు వచ్చాక వారిని గదిలో బందించి రాడ్లతో దాడి చేయించింది.

కాగా సదరు మహిళ గతంలో సికింద్రాబాద్ (Secunderabad) వారాసిగూడలో సైతం పలువురిని ఇలాగే మోసం చేసింది. అనంతరం అక్కడి నుంచి పటాన్​చెరుకు మకాం మార్చింది. బాధితులు సదరు మహిళపై పటాన్​చెరు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.