అక్షరటుడే, కామారెడ్డి: kamareddy SP | కామారెడ్డి పట్టణంలోని సీఎస్ఐ చర్చి గ్రౌండ్ (CSI Church grounds) సమీపంలో నాలుగు రోజుల క్రితం సగంగా తెగిపోయిన మృతదేహం లభ్యమవడం కలకలం సృష్టించింది. అనంతరం బుధవారం రాత్రి మృతదేహానికి సంబంధించిన తల, చేతులు సహా మరికొన్ని భాగాలు ముక్కలుగా లభించాయి. దీంతో ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది.
kamareddy SP | ప్రాథమిక విచారణలో..
పోలీసుల ప్రాథమిక విచారణలో మృతుడిని ఇతర ప్రాంతంలో హత్య చేసి, ఆధారాలు దాచే ఉద్దేశంతో శరీరాన్ని ముక్కలుగా చేసి పడేసినట్లు అనుమానిస్తున్నారు. మృతదేహం ఎవరిదన్న దానిపై ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మృతదేహానికి సంబంధించిన వివరాలు అందించిన వారికి రూ.10 వేల బహుమతి ఇస్తామని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
kamareddy SP | మృతుడి వివరాలు ఇవే..
మృతుడి వయస్సు సుమారు 25–30ఏళ్లు ఉండవచ్చని, తలపై జుట్టు లేకుండా గడ్డం ఉందన్నారు. మణికట్టుకు నల్ల తాయత్తు కట్టుకొని ఉందన్నారు. ఈ వివరాలకు సరిపోలే వ్యక్తులు ఎవరైనా ఇటీవల అదృశ్యమై ఉంటే లేదా ఘటనపై సమాచారం ఉన్న వారు టౌన్ సీఐ 87126 86145 నంబర్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.