అక్షరటుడే, వెబ్డెస్క్ : Osmania University | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) బుధవారం ఉస్మానియ యూనివర్సిటీలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వం యూనివర్సిటీ అభివృద్ధి కోసం రూ.1000 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ ఉద్యమంలో ఓయూ ఎంతో కీలక పాత్ర పోషించింది. యూనివర్సిటీలో పర్యటిస్తానని సీఎం ఇటీవల పేర్కొన్నారు. ఇందులో భాగంగా నేడు ఆయన ఆర్ట్స్ కాలేజీ (Arts College) వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. యూనివర్సిటీ అభివృద్ధి, ఉద్యోగాల భర్తీపైనా ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. సీఎం రేవంత్రెడ్డి ఓయూలో పర్యటించడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
Osmania University | శంకుస్థాపనలు
విశ్వవిద్యాలయంలోని పలు హాస్టళ్లు శిథిలావస్థకు చేరాయి. వాటిని తొలగించి కొత్త భవనాలు నిర్మించనున్నారు. ఇంటిగ్రేటెడ్ హాస్టల్ భవన సముదాయం, ఇంజినీరింగ్ కాలేజీ (Engineering College)లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, ఆడిటోరియం, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ లా భవనానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Osmania University | బీఆర్ఎస్ హయాంలో నిర్లక్ష్యం
బీఆర్ఎస్ హయంలో ఓయూ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని కాంగ్రెస్ నేత చనగాని దయాకర్ (Congress Leader Chanagani Dayakar) ఆరోపించారు. యూనివర్సిటీని ప్రపంచస్థాయిలో నిలబెట్టేందుకు సీఎం రేవంత్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఓయూకి పూర్వవైభం తీసుకు రావడానికి ముఖ్యమంత్రి గొప్ప ఆలోచన చేశారన్నారు. యూనివర్సిటీ అభివృద్ధికి ఇప్పటికే డీపీఆర్ సిద్ధమైందని తెలిపారు.