ganja burnt | రూ. 10 కోట్ల విలువైన గంజాయి కాల్చివేత
ganja burnt | రూ. 10 కోట్ల విలువైన గంజాయి కాల్చివేత

అక్షరటుడే, హైదరాబాద్: ganja burnt : రాష్ట్రవ్యాప్తంగా ఆయా రైల్వే స్టేషన్లలో పట్టుబడిన గంజాయిని GRP సికింద్రాబాద్ పోలీసులు కాల్చి వేశారు. 2024 -25 సంవత్సరంలో NDPS యాక్ట్ కింద 74 కేసులలో పట్టుబడిన రూ.పది కోట్ల విలువ చేసే రెండు టన్నుల పది కేజీల గంజాయిని దహనం చేసినట్లు డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఛైర్మన్, రైల్వే ఎస్సీ చందన దీప్తి Chairman of the Drugs Disposal Committee , Railway Sp Chandana Deepti ప్రకటించారు.

కొందరు స్మగ్లర్లు రహదారిలో కాకుండా రైలు మార్గంలో గంజాయిని తరలిస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, కాజీపేట వెళ్లే రైళ్ల ద్వారా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గంజాయి రవాణా జరుగుతున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు రైల్వే పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ గంజాయి సీజ్ చేస్తున్నారు.

ఏడాది కాలంలో పట్టుబడిన గంజాయిని కోర్టు ఆదేశాల మేరకు తాజాగా యాదాద్రి జిల్లా భువనగిరి మండలం తుక్కాపురంలోని రోమా కంపెనీకి తరలించి, అక్కడి బ్రాయిలర్‌లో గంజాయిని వేసి కాల్చివేశారు.