అక్షరటుడే, బాన్సువాడ: Banswada | మొబైల్ కు మెసేజ్.. ఓటీపీ రాకుండానే ఓ వ్యక్తి ఖాతాలో నుంచి రూ. 1.20 లక్షలు మాయమైన ఘటన బాన్సువాడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాన్సువాడ పట్టణానికి చెందిన సయ్యద్ రఫీకి చెందిన యూనియన్ బ్యాంకు ఖాతా (Union bank account) నుంచి మూడు విడతల్లో రూ. 1.20 లక్షలు మాయమయ్యాయి. ఈనెల 5న రూ. 10 వేల చొప్పున రెండుసార్లు విత్ డ్రా కాగా, కంగారు పడిన రఫీ బ్యాంకు అధికారులను సంప్రదించారు. తర్వాత రోజు మరో రూ. లక్ష విత్ డ్రా అయ్యాయి. దీంతో సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయడంతో ఈనెల 14న పోలీసులు కేసు నమోదు చేశారు.
